పెనుగొండ పట్టణంలో ఎక్కడ చూసిన కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. రోడ్లపై దారిన పోయే వాహనదారులను వెంబడించి భయపెడుతున్నాయని రాత్రి సమయాల్లో రోడ్లపై గుంపులుగా చేరి రోడ్డు మధ్యలో నిర్ద్రిస్తున్నాయని వాహనదారులు ఆదమరిస్తే అంతే సంగతులు అంటున్నారు. అధికారులు వీటి నిర్మూలన పై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.