ఆచంట మండలం వల్లూరులో ఆదివారం ఏకలవ్యుని జయంతి వేడుకలు నిర్వహించారు. ఏకలవ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకల్లో జనసేన నాయకుడు చిట్టూరి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు కడిమి ఉమామహేశ్వరస్వామి, మండల ఉపాధ్యక్షుడు తోట ఆదినారాయణ పాల్గొన్నారు.