పెనుగొండ మండలం, కొఠాలపర్రులో తొలి ఏకాదశి పూజలు ఆదివారం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి స్వయంభు కేశవ స్వామికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కేశవ స్వామి వారిని అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కేశవ స్వామి దర్శనం, తీర్థప్రసాదాలు స్వీకరించారు.