పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజును పొలిటికల్ అడ్వైజరింగ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రంగనాథరాజు మాజీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.