పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం, ఇలపర్రు తదితర ప్రాంతాలలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి 20 నిమిషాల పాటు వడగళ్ల వర్షం కురిసింది. దింతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడటంతో భయాందోళనకు గురవుతున్నారు.