పెనుగొండ పట్టణ మండల వ్యాప్తంగా గురువారం ఈదురుగాలులతో,ఉరుములు పెద్దపెద్ద పిడుగులు శబ్దంతో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్క పోత ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు ఒక్కసారిగా సాయంత్రము నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. భారీగా కురుస్తున్న వర్షముతో రోడ్ల వెంబడి సంచార వ్యాపారులు వ్యాపార సమయములో వర్షం రావడంతో కొంత నష్టం వ్యాపారం ఒక్కసారిగా ఆగిపోయిందని వ్యాపారులు వాపోయారు.