పెనుగొండ మండలంలో టీడీపీ సిక్స్ మెన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెనుగొండ పట్టణ నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కటికిరెడ్డి నానాజీ అధ్యక్షుడిగా, కుడిపూడి సత్య భీమన్న ఉపాధ్యక్షుడిగా, రొక్కాల సురేష్ బాబు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పలివెల జాకోబు, చవక వాసు తదితరులు కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించారు.