పెనుగొండ మండలం కొటాలపర్రు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కేశవస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం స్వామి వారి దర్శనంకి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, పల్లకీ సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కొటాలపర్రు, పెనుగొండ, శేషమ్మ చెరువు, నెగ్గిపూడి, మార్టేరు తదితర గ్రామాల ప్రజలు స్వామి వారిని దర్శించుకున్నారు.