ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో గురువారం ఎన్సీడీ 3.0 సర్వే నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచి, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. రక్తపోటు, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం భాగ్య కుమారి, ఆశా సిబ్బంది చురుగ్గా పాల్గొన్నారు.