పెనుగొండలో శాంతినగర్ లో పద్దాల వెంకమ్మ జాతర మహోత్సవం వైభవముగా ఆదివారం నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి పూజ నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం గరగల నృత్యాలు, మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. కొందరు మహిళలు ఏకరూపు వస్త్రాలు ధరించి ఆకట్టుకున్నారు. జాతర మహోత్సవం సందర్భంగా శాంతి నగర్ వసూలు సామూహిక భోజనాలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.