పండితవిల్లూరు సర్పంచి చెక్ పవర్ రద్దు

14చూసినవారు
పండితవిల్లూరు సర్పంచి చెక్ పవర్ రద్దు
పోడూరు మండలం పండితవిల్లూరు సర్పంచి చెక్ పవర్ రద్దయింది. ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు పంచాయతీలో ఆర్థిక పరమైన లావాదేవీలు నిర్వహించవద్దంటూ జిల్లా పంచాయతీ అధికారి రామనాథ్ రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. డిప్యూటీ ఎంపీడీవోకు చెక్ పవర్ అధికారం ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పంచాయతీలో నిధుల మళ్లింపు వ్యవహారంపై గతంలో డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ జరిపారు.

సంబంధిత పోస్ట్