పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా దివ్యాంగులకు, వృద్ధులకు రేషన్ పంపిణీ ఇంటి వద్ద అందించే విధంగా చర్యలు చేపట్టారు. దేవాంగులపేటలో 65 సంవత్సరాలు నిండిన వృద్ధురాలి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు పంచాయతీ పిసిని అప్పలనాయుడు, కారేపల్లి భాస్కరరావు, మజ్జి అచ్యుతరావు, మార్టేరు టౌన్ టిడిపి ప్రధాన కార్యదర్శి, రాజేష్, రోబిభాస్కరరావు ఉన్నారు.