పెనుగొండ బస్టాండ్ రోడ్డులోని పోలీస్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా వున్న శ్రీ సంపత్ వినాయకుడి ఆలయంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, అష్టోత్తరం, నీరాజనం నిర్వహించబడింది. బుధవారం స్వామివారికి ప్రతిపాత్రమైన రోజు కావడంతో ఉదయం 4:30 గంటల నుంచే భక్తులు దర్శనానికి వచ్చారు.