భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గొప్ప మానవతావాది అని పెనుగొండ ఎంపీడీవో టి. సూర్యనారాయణ మూర్తి అన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా సోమవారం పెనుగొండ మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పెనుగొండ మండలంలో ప్రతి గ్రామములో పంచాయతీ కార్యాలయాల వద్ద, అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రజా ప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు