పెనుగొండ: అర్హులు ఇళ్ళస్థలాలకు దరఖాస్తు చేసుకోండి

67చూసినవారు
పెనుగొండ: అర్హులు ఇళ్ళస్థలాలకు దరఖాస్తు చేసుకోండి
అర్హత కలిగిన లబ్ధిదారులు ఇంటి స్థలము కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని పెనుగొండ మండల తహసీల్దార్ జి. అనిత కుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ జీవో ప్రకారం అర్హత కలిగిన కుటుంబానికి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు ఇండ్ల స్థలం ఇవ్వటం జరుగుతుందని అన్నారు.  లబ్దిదారులు గ్రామ వార్డు సచివాలయాలలో, గ్రామ రెవెన్యూ, తహసీల్దార్ కార్యాలయాల్లో తమ దరఖాస్తులు తీసుకోవచ్చని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్