పెనుగొండ: క్రమంగా గోదావరికి పెరుగుతున్న వరద

0చూసినవారు
పెనుగొండ: క్రమంగా గోదావరికి పెరుగుతున్న వరద
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పెనుగొండ మండలం సిద్ధాంతం తదితర ప్రాంతాల్లో గోదావరికి వరద నీరు క్రమంగా పెరుగుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు ఉపనదుల నుంచి వరద నీరు వస్తుండడంతో గోదావరి నిండుకుండలా ప్రవహిస్తుంది. సిద్ధాంతంలో కేదారి ఘాట్ పుష్కర రేవులకు నీరు చేరుకుంది. ప్రస్తుతానికి సిద్ధాంతం వద్ద మధ్య లంకలోకి రైతులు రాకపోకలు యథావిథిగా కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్