పెనుగొండ మండలం సోమరాజు చెరువు గ్రామపంచాయతీ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ దంపనబోయిన రూపవతి హరిబాబు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాలలు వేశారు. గ్రామ సర్పంచ్ రూపవతి మాట్లాడుతూ.. మనం ఒక గొప్ప సాంఘిక సంస్కర్త, న్యాయబద్ధ సమాజాన్ని కలగలిపిన మహనీయుడు అయిన జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం.