ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో పెనుగొండ ఎస్వీకేపీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శనను కనబర్చారు. ఈ సందర్భంగా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ విద్యార్థులు, అధ్యాపకులను ఆదివారం అభినందించారు.ఎస్.వీకేపీ కళాశాలలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పితాని, కళాశాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.