పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం -నిడదవోలు రోడ్లో పెనుగొండ వద్ద గల ప్లే ఓవర్ (పెద్ద వంతెన) మరమ్మత్తుల పనులు వేగముగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రోడ్డు పై భాగం తొలగించి పాత ఐరన్ రాడ్లను తొలగించి రోడ్డు జాయింట్లు లో ఐరన్ అమరుస్తున్నారు. అనంతరం వంతెన ఇరువైపులా సిసి రోడ్డు నిర్మాణం చేపడతారని కాంట్రాక్టర్లు తెలుపుతున్నారు.