కల్తీ మద్యం, అక్రమ మద్యం అరికట్టకుండా, అక్రమ బెల్టు షాపులు తొలగించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నా లేకున్నా ఒరిగేది ఏమిలేదని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుల నరసింహామూర్తి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం పెనుమంట్ర మండల సొసైటీ ప్రెసిడెంట్ల సమావేశం బ్రాహ్మణ చెరువు రైతు సంఘం ఆఫీసులో కడలి బాలాజీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నరసింహామూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయని, ప్రకృతి సిద్ధమైన, ఆరోగ్యకరమైన తాటికల్లు అమ్మకాలు లేకుండా ఘోరంగా దెబ్బతీసిందని విమర్శించారు. . బెల్ట్ షాపులు తొలగించి కల్లుగీత కుటుంబాలను ఆదుకోమని ఈనెల 14వ తేదీన కలెక్టర్‌కు చెప్పుకుందాం రండి అన్నారు. మోకులు ధరించి అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు.