గ్రామాల్లో ఓల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మార్టేరు పెద్ద వీధి, నాయి బ్రాహ్మణుల వీధిలో రూ. 6 లక్షలతో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల నిత్యవసర వస్తువు అయిన విద్యుత్ సరఫరాలో లో ఓల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.