పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం వర్కర్స్ యూనియన్ నాయకులు, సీపీఐ శేషమ్మచెరువు గ్రామశాఖా కార్యదర్శి జక్కంశెట్టి నాగేశ్వరావు (68) అనారోగ్యంతో గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆయనకు భార్య, ఇరువురు కుమార్తెలు వున్నారు. ఆయన మృతి పట్ల సిపిఐ నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.