పెనుమంట్ర మండలం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ఎంటియు 1318 రకం వరి విత్తనం అందుబాటులో ఉందన్నారు. ఈ మేరకు పరిశోధనా సంస్థ సహాయ సంచాలకులు టి. శ్రీనివాస్ బుధవారం వివరాలు వెల్లడించారు. 25 కేజీల ప్యాకింగ్ ధర రూ. 1, 050 ఉందన్నారు. కావున మండల పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగించుకోవాలని సూచించారు.