పోడూరు మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన యువతి దొంతుకుర్తి కుమార చంద్ర శశి తేజకు వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 8 లక్షలను పాలకొల్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆలయ అర్చకులు కొత్తలంక రాధాకృష్ణకు అందజేశారు. తన కుమార్తె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నందున వైద్య సహాయం అందించాలని రాధాకృష్ణ అడిగారు. స్పందించిన మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రూ. 8 లక్షల చెక్కును మంజూరు చేయించారు.