పోడూరు: భర్త కనిపించడం లేదని భార్య ఫిర్యాదు

55చూసినవారు
పోడూరు: భర్త కనిపించడం లేదని భార్య ఫిర్యాదు
పోడూరు మండలం కోనబోతుగుంటకు చెందిన ఇళ్ల వీర వెంకటస్వామి అదృశ్యంపై భార్య శ్రీదేవి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మవారి జాతర నిమిత్తం వీరిద్దరూ గత నెల 22న పోడూరు వచ్చారు. హైదరాబాద్ లో జాబ్ చూసుకుంటానని భర్త గత 23న వెళ్లిన రోజు నుంచి ఆచూకీ తెలియడం లేదని, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని విచారించినా ఆచూకీ లభించలేదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్