పెనుగొండ మండలం సిద్ధాంతం 33/11 పరిధిలో విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలిగింపు, లైన్ మెయింటినెన్స్ కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ సురేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం పెనుగొండ, వడలి, సిద్ధాంతం, దొంగరావిపాలెం, ములపర్రు, మండలంలోని ఇతర గ్రామాలలో ఉదయం 7: 00 గంటల నుంచి మధ్యాహ్నం 12: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.