తణుకు నియోజకవర్గ పరిధిలో ఇటీవల కొత్తగా నియమితులైన అంగన్వాడి హెల్పర్లకు తణుకు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాలను బుధవారం అందజేశారు.తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని మరిన్ని అవకాశాలు అందు పుచ్చుకొని పైకి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.