పెనుగొండ మండలంలో ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారి వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తహసిల్దార్ జి. అనిత కుమార్ గురువారం సూచించారు. సిద్ధాంతంలో పర్యటించిన ఆమె, రేషన్ కార్డు, ఆధార్ తప్పనిసరి అని, గతంలో ఇల్లు పొందిన వారికి మళ్లీ స్థలం ఇవ్వరని తెలిపారు. అర్హులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.