ప. గో. జిల్లాలో జనసేన సమన్వయకర్తలు వీరే

73చూసినవారు
ప. గో. జిల్లాలో జనసేన సమన్వయకర్తలు వీరే
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ఈనెల 14న పిఠాపురం చిత్రాడలో జరగనుంది. ఈ సందర్భంగా ఆవిర్భావ సభకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను పార్టీ అధిష్టానం బుధవారం నియమించింది. నరసాపురం నియోజకవర్గానికి చెందిన వి. కనకరాజు, వర్ధన ప్రసాద్, వలవల నాని. భీమవరం పట్టణానికి చెందిన మోకా శ్రీను, కత్తులు నరేంద్ర, హరి వర్ధన్, జువ్వది బాలాజీ, అడ్డాల రాము, ఎరక రాజు హరిబాబు. ఆచంట నియోజకవర్గానికి చెందిన జవ్వాది బాలాజీ శ్రీనివాస్, కొయ్య వెంకట కార్తీక్, కొండవీటి శ్రీనివాసరావు, రావి హరీష్. పాలకొల్లుకి చెందిన బోనం చినబాబు, తుల రామలింగేశ్వర రావు, వరబాబు, సూరి. తణుకుకి చెందిన దాసం ప్రసాద్ వేణుగోపాల్, కాశి, కొమ్మిరెడ్డి శ్రీనివాస్. ఉండికి చెందిన గడ్డం నానాజీ, ఎరుబండ రామాంజనేయులు, దారపురెడ్డి కన్నబాబు. తాడేపల్లిగూడెంకి చెందిన వర్తనపల్లి కాశి, అడపా ప్రసాద్, పుల్లా బాబి, మైలవరపు రాజేంద్రప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు సమన్వయకర్తలుగా నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్