విజన్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేసి వారి అవసరాలను గుర్తించి ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలు ప్రభుత్వం రూపొందించనున్నదని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. ఆచంట నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను ఆచంట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాక్షన్ ప్లాన్ ద్వారా నియోజకవర్గ ప్రజల అవసరాలను తీర్చునున్నట్లు తెలిపారు.