భీమవరంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో బొక్కవారిపాలెంకు చెందిన బొక్క లక్ష్మీ శ్రీగణేశ్(13) మృతి చెందాడు. సైకిల్‌పై మంచినీరు తెచ్చేందుకు వెళ్తుండగా పాలకొల్లు వైపు నుంచి భీమవరం వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. దీంతో గణేశ్ తలపై నుంచి వ్యాన్ వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ స్కూల్ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.