అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఓ కుటుంబానికి జనసేన పార్టీ నాయకులు తమ వంతు సాయం అందించారు. ఆచంట మండలం పెదమల్ల గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో సిర్ర ధనరాజుకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్పందించిన ఆచంట మండలం జనసేన నాయకులు శుక్రవారం బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు, బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు.