ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని ప. గో. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. భీమవరం విష్ణు ఇంజినీరింగ్ కళాశాల, ఎస్ ఆర్ కె ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను, మీడియా సెంటర్లను శనివారం పరిశీలించారు. తొలుత విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు.