భీమవరం: కాలం చెల్లిన పదార్థాలు విక్రయిస్తే చర్యలు: జెసి

67చూసినవారు
భీమవరం: కాలం చెల్లిన పదార్థాలు విక్రయిస్తే చర్యలు: జెసి
భీమవరం బస్టాండ్ వద్ద బుధవారం మార్కెట్ సెంటర్ సాయిబాబా గుడి రోడ్డులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ ట్రేడర్స్, కిరణ్ ట్రేడర్స్ దుకాణాలను.. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు సమాచారం శాఖ అధికారి మంగళవారం తెలిపారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన చిల్లీ పౌడర్, గ్రౌండ్ నట్ ఆయిల్ ప్యాకెట్లు, కిస్మిస్, వేయించిన శనగపప్పు, సరుకులను గుర్తించారు. ప్యాకింగ్ లపై తయారీ కేంద్రాల చిరునామాలు, కస్టమర్ కేర్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్ లు లేకపోవడం గమనించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్