భీమవరం: బుద్ధుని విగ్రహం ధ్వంసం.. దుండగులను అరెస్ట్ చేయాలి

0చూసినవారు
భీమవరం: బుద్ధుని విగ్రహం ధ్వంసం.. దుండగులను అరెస్ట్ చేయాలి
బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని భీమవరంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ కోనా జోసెఫ్ మాట్లాడుతూ మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి సమీపంలోని బుద్ధుని కొండపై గత 21 ఏళ్లుగా ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. బుద్ధుని తలనరికి కాళ్ల దగ్గర పెట్టిన ఉన్మాదులను వెంటనే పట్టుకుని వారికి చట్టపరమైన శిక్ష విధించాలన్నారు.