యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని భీమవరం వన్ టౌన్ సిఐ నాగరాజు అన్నారు. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో శనివారం కళాశాల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా సిఐ నాగరాజు మాట్లాడుతూ ప్రతిరోజు యోగాను దీనిచర్యగా చేసుకోవాలని, యోగాను అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.