భీమవరంలో శనివారం జరిగిన సీపీఎం జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర నాయకుడు బలరాం మాట్లాడుతూ ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం విధించిన షరతులు అన్యాయమని విమర్శించారు. అర్హులైన ప్రతి తల్లికి పథకం న్యాయంగా లభించాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాలకు మేలు చేసే ఈ పథకం అమలులో పారదర్శకత అవసరమన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.