తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలోని గోవులు చనిపోయాయని టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా భీమవరంలో శనివారం ఆమె మాట్లాడారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలలో అలజడి సృష్టించి భక్తుల ప్రశాంతతకు భంగం కలిగించేలా కుట్ర చేస్తున్నారని తెలిపారు.