భీమవరం: అదుపుతప్పిన సైకిల్.. వ్యక్తి మృతి

73చూసినవారు
భీమవరం: అదుపుతప్పిన సైకిల్.. వ్యక్తి మృతి
భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన నాగార్జున లక్ష్మీకాంత్ (34) భీమవరంలోని ఒక మెడికల్ షాపులో పనిచేస్తున్నారు. శుక్రవారం సైకిల్ పై వెళ్తుండగా కాళ్ల మండలం పెదఅమిరం సమీపాన అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రాయిపై పడిపోయారు. నుదిటి భాగంలో రక్తగాయం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తండ్రి మదనాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్. శ్రీనివాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్