భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం యోగా దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ నాగరాజు మాట్లాడుతూ.. ప్రతిరోజూ యోగా చేయడం ఒక మంచి అలవాటుగా మార్చుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యోగా వల్ల ఆరోగ్యంగా ఉండటం సాధ్యమని సూచించారు.