ప్రమాదాలు, విపత్తుల సమయంలో భయపడవద్దని, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని భీమవరం కలెక్టర్ నాగరాణి అన్నారు. రాష్ట్ర విపత్తుల సహాయ బలం (ఏపీఎస్ డీఆర్‌ఎఫ్), అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖలు సంయుక్తంగా బుధవారం కొత్త బస్టాండ్ ఆవరణలో మాక్ డ్రిల్‌తో ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం ప్రయోగాత్మకంగా ప్రమాద నివారణ చర్యలు వివరించారు.