ప. గో. జిల్లా పరిధిలోని బీసీ, ఈబీసీ సామాజిక వర్గాలకు డీఎస్సీ- 2025 పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ సాధిరత అధికారి గణపతిరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం భీమవరంలో ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. బీఈడీ, టీటీసీతోపాటు ఏపీ టెట్ పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలన్నారు.