భీమవరం :విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం

83చూసినవారు
వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు గొప్ప అవకాశమని పారిశ్రామికవేత్త సంజీవ్ సోని పేర్కొన్నారు. భీమవరంలో నిర్వహించిన రోప్ స్కిప్పింగ్, మల్లఖంబ్, కరాటే, రైఫిల్ షూటింగ్ వంటి ఉచిత శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. 40 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ తరహా శిక్షణలు భవిష్యత్ విజయానికి పునాది అవుతాయని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్