భీమవరం పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థిని కనిపించడంలేదని బాలిక తండ్రి శనివారం ఫిర్యాదు చేశారని టూటౌన్ పోలీసులు తెలిపారు. శ్రీరామ్ అనే యువకుడితో సన్నిహితంగా ఉండటంతో అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తండ్రి ఫిర్యాదు చేయగా టూటౌన్ ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు.