భీమవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గ్రామీణ్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై జిల్లాలో వివిధ చిన్న తరహా పరిశ్రమల వ్యవస్థాపకులను ప్రోత్సహించే దిశగా అందించే సాయంపై మంగళవారం చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన యానాది, ఎరుకల కుటుంబాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలన్నారు.