తుఫాను అంచనాలను పరిగణలోకి తీసుకుని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం, సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం భీమవరంలో మండల వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు. సిపిఎం మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ, రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.