భీమవరం బీవీ రాజు కూడలి నుంచి మెంటేవారితోట బైపాస్ రోడ్డులోని విద్యుత్ టవర్‌పై శనివారం మద్యం మత్తులో కె. శ్యామ్ అనే యువకుడు ఎక్కి హల్‌చల్ చేశాడు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఏఈ కె. రవివర్మ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు కుటుంబ సభ్యుల సహాయంతో అతడిని కిందకి దింపి, స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.