కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) గురువారం రాత్రి కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే అంజిబాబు కోరారు. అలాగే రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ గోపి మూర్తి, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తదితరులు మంత్రి శ్రీనివాస వర్మను పరామర్శించారు.