"పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం" సందర్భంగా భీమవరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణారాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీసు వారికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. శాసనమండలి ఛైర్మెన్ కొయ్యే మోషెన్ రాజు, కలెక్టర్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసి ఛైర్మన్, జిల్లా ఎస్పి అద్నాన్ నయీమ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.