ప. గో. జిల్లా కలెక్టర్ నాగరాణి మానవతా సేవల్లో చూపిన విశేష కృషికి గుర్తింపుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రస్థాయి అవార్డును ఇటీవల గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు కలెక్టర్ నాగరాణిని తణుకు నియోజకవర్గం శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ కలిసి అభినందనలు తెలిపారు. సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణ సహాయం అందించడంలో ఆమె తీసుకున్న చొరవ అభినందనీయం అన్నారు.